దోసిట నీరు తాగిన గాలి ఊరు మట్టి ఊపిరి
మన్ను మొలకలదే కీర్తి మనసు దోచిన నేల
పదపదమనని పల్లెపదములో ఓర్పు ఓదార్పు
చెప్పులులేని నడక బాటలో పలుగురాళ్ళ తీపి
బాధకు తెలియని బాధల శయ్య ప్రేమ ఊరు
పేరు పేరున తట్టిలేపు మనిషి సజల నేత్ర ఋషి
గాలి తీగల సాగే నీటిధార తుంపర సేద్య సింఫొనీ
జూదమెరుగని చోటు మోద చిత్తాల కొత్త సందడి
ఆగమాగము గజిబిజి కలగనని జీవకథ మాఊరు
అప్పిచ్చు జీవుని అక్కరే లేని సెలయేరు ఊరు
ప్రకృతీ వైద్యుడు మనిషికీ మనసుకూ తోడునీడ
పైసలే ఆడని ఊరున ధాన్యరాశులెల్ల కాచేను
అవనిలో అమ్మ ఆశల పందిరి కృషి ఫలించగ
అట్లతద్దె ఊగెఊయల నింగినంటే సంబరం ఊరు
సాదసీదా బతుకు హూందాగ తిరుగు తల్లినేల
కనుల చల్లని చూపు ఆత్మలో ఊరు బంగారు
పెళ్లి చూపుల ముచ్చట ఊరు ఊరంత పండుగ
అనురాగసీమలో అందాల భరిణ రాగాల వీణ
కష్టమేమైన ఇష్టమైన గుంపు వేడుకలు పల్లెనేలు
చిన్నపెద్దలు చేరి పంచుకొను సిరులు ఆనందాల
ఎక్కడా లేదుగ లోకాన ధీర నిండు మనసు ఔర!
==================================
(ఇంకా ఉంది)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి