ఊరుగాలి ఈల 24:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
కావ్య నాయిక నటన పద్య కవితల తేలే
వ్యథల కథ పల్లెసీమ మనసు  అడుగడుగు 
ఉద్విగ్న ఉత్తుంగతరగ అంతరంగ గంగ ఊరు 
  
వలపు తీగలూగే మత్త కోయిల పాట సారంగి
తరువు ఆకుల ఊరేగే కొత్తరాగాల కూన
మనసుదోచని మనిషి శూన్యమైన గాధల ఒడ్డు

యక్షగానాల తెరపైన జానపదుల జ్ఞానం
తోలుబొమ్మలాడే దారాల మాటు నేత్రం
కళలు విరిసే భారతి కలల నేత్రి ఊరు వినోదం

పాకప్రావీణ్య మది వంటరుచుల పంట పల్లె
వెండి కంచం మధు కలశంలేని తిండి తీపి 
అనుభవాల అనుభూతి నింపిన ధాన్యసిరులు

ఆహార వీధుల విహరించే మనసు ఆకలి
నరుల నడక తీర్చేటి చిరుతలు రామగానం
మనిషి నవ్విన మనసు చిరునవ్వు పల్లె

మూలనున్న అవ్వ ముసినగవు కొంగు బంగారు
ఆనంద లహరుల తేలిన గాలి ఊరు పేరు
సిరిపువ్వుల విరిసె చిరునవ్వు ఊరు సిగలో

నోటిపాటల దేలే గూటి గువ్వల గీటురాయి
మనసు పాడిన గేయరాగాలు తనివితీర 
పాడే ఊరు
పదపాద రవళి కదంతొక్కిన నేల మరువలేను

==========================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు