గాలివాటం ఆలంబన గాలిగాలి పాట లేదు
మాయమాటల మోసం ఎగిరిపడే వేషం లేదు
ఊరంటే చలి దుప్పటి వెలుగు తోడ చీకటి
పొద్దుపొద్దు ముద్దమెతుకు సందెకాడ చెలిముద్దు
హద్దు దాటని సొగసుల ప్రేమ పంచే మనసు
కొనలేని సిరులు విరితావుల గుండె చిరునవ్వు
సందిట పురివిప్పే మయూరి సవ్వడుల ఊరు
ఎలుగెత్తి పాడేటి అందాల గీతం పల్లె నిండు ఆశ
చుట్టుపక్కల నిగ్గులే విరిబోణి ఆరబోసే సిగ్గులు
ఆమని పిలిచే వనశోభల ప్రియమణి కచేరి బాణి
లలిత ప్రియ భావాలు చలిత చండిక నేత్రాలు
ఏ భాషలో తర్జుమా ఏమైనా ఊరంటె నాఊరే
స్వచ్ఛసీమ రెక్కలు మిసిమి సరుకు నౌక
పెద్ద అలలైన చిన్న కలలైనా ఒక నుడి నాగలి
చల్లని దీవెన వెచ్చని కోవెల రూపురేఖ పల్లెఅనల
పప్పుబెల్లాల పిల్లలాడు మట్టి పుట్టిపెట్టే పట్టి
నాకు తెలిసిన అందాల బొమ్మ చిలుక పలుక
వింతగాని వింత సొంత ఊరు కొంత పొగరు
అడవిలో అడవి ఆకులో ఆకు బతుకున ఊరు
ఊరు సెలయేరు ఆటలో ఆట సంకెల కాని సంకెల
గాలిమడి జలదరించే అమ్మతడి వొడిసే వెచ్చన
=============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి