ఊరుగాలి ఈల 29:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
రాజసం లేని రారాజు తీరు పల్లె జాబిల్లి
నింగి ఉప్పొంగే కడలి కేళి పున్నమి వెన్నెల
సుఖదుఃఖ వాడల జారేటి తడి కనుల కన్నీరు

గట్టి పెట్టిన పలక మెరిసె అద్దాల అందాల కొండ 
ఉత్తరం రాసిన మోసిన చేతులు అందించే క్షేమం
లేఖలే ఆకులై తెచ్చిన వార్తల ఎగిసిన మది ఆనంద

సప్తతిలో మనసు వెనుదిరిగి పల్లె మీటే  యాది
గంభీర వనిలో అసమానకాంతి ఆడే ఇంతి సగటు
గణితానికే అందని సూత్రాలేవో సీస పద్యం

తుంపర మంచు తుంటరి చేతలు ఊరు తెంపరి
మరిమరీ కురిసే రాగాలలోన వాన తడి పొడిగా 
మారాకు తొడిగే ఉల్లమే ఝల్లనగ ప్రేమ అలుక

కుక్కుకొని పోయే ఎర్రబస్సే మనసుల దోచే మిస్సు
చక్రము అమరిన చేతుల చోదక చోద్యం కుదుపు
రెండు మనసులు ఉండే ఒకచోటు పల్లె పడతి

తీరని బాధలదీర్చే తీయని పాటల నాట్యసీమ
వింత పోకడలేని కొత్త చీదర అప్పు  తచ్చు  
నిదురించే తోట విహరించే రెక్క పల్లె అల్లరిలే

===============================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు