ఊరుగాలి ఈల 34:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు
నగరాల బతుకు పల్లేరు కాదు నల్లేరు కాదు
చలికాగ మంటలెక్కడ హీటర్ మీటర్ పక్కన
విలాసాల నగర మేడ కాదు కోన కొబ్బరితోట

దూపకూ కాపుకూ పల్లె ఆసరా లేని నగరి నగ
చల్ల కదలని కడుపు పల్లె తృప్తినీదు నగరి
అప్పుల కొప్పులు ఊరించు సీమ నమ్మిక ఊరు

గతుకుల దారుల పట్నం ఆకలికి అన్నం ఊరు
నగరి మెరుపుల మబ్బు మనిషి ఆశే ఊరు
ఊరు బంగారు పూలతోట నగరి బాట సినిమా

నింగి నేలేటిది పట్నం మనిషి నోరు ఊరు
నగరంలో వాన నీరు రోడ్డెంట పల్లెలో చెరువుల
మంచి చెడుల గమ్య గమనాల తెలుపు ఊరు

ఊరు నీడల లేని అవసరాల తోవ  పట్నసిరి 
ఆరోగ్యభాగ్యాల ఆలవాలం నగరి అద్దమే 
భోగభాగ్యం నాజూకు నజరాన ఠీవి నగరి

తెలివి తేటల గదిలో పాఠం నగరధామం 
మూలాల తడి పెన్నిధి సన్నధి ఊరు వాడ
ఆకాశమే హద్దుగా ఆడే ఊరు కనలేని నగరి

మనిషిలో అమ్మకం పేట మనసు నమ్మిక ఊరు
నటనల నగరి  ప్రేమరాగాల పల్లెసీమ చూడు
సొక్కమే పల్లె జిగేల్ నగల బతుకు పేట సదా

--------------------------------------------------
(ఇంకా ఉంది)
--------

కామెంట్‌లు