అమ్మనేలలో అమ్మభాష గొప్పతెలుగు పల్లె వెలిగే
తెలుగుతీపి గొప్ప విశ్వం ఎగిరేసె ఆంగ్లాది భాషలు
కృషితోనే దున్ను పదునుగ నాగలి స్వేదభాష ఎద
అన్నపానాదులు వేషభాషలు పల్లెపేటల మెట్లు
కాలంలో బతుకు మెతుకు సాధనల మైలురాళ్ళు
ఆశలు నిండిన సొగసు సోపతి బతుకు పల్లె పేట
ఆమె అతడు అక్కచెల్లె కలిసిన సరమే సమాజం
జాతి ఏకత కుల మత ఐక్యత నేత మనిషిగీతం
మాటొక్కటే ఒప్పించు పల్లె పేట భాయ్ 'లో'మది
తీరాలు చేరు అలలు కష్టాలు కన్నీరు మన కలలు
నీవునేను కాదు మనమై మాట్లాడే గట్టి మాటే జీవి
పల్లెపేటల మనసు మట్టి నాలుక భావన గొప్పగా
బతుకురేఖ నడుమ ఆదిఅంతం నిజం
అంతరంగాల చలనచలనాలే మనిషి సోయి
పాటకోయిల చెట్టు ఊయలలూగే జీవి బస్సు
ప్రేమజీవి సోయగాల సోపానం మనిషి బతుకు
పదును మేధ నగరి పదును పల్లె జన జీవం
ఆస్తిపాస్తులు ఆకలీపస్తులు పురుగు బూచి తోడు
ఆశల చుక్కాని ఊహల పల్లకి మోసే జీవితావని
మాటలమూటలు విప్పే రాజకీయం వృధా
ఎవరేలినా సగటుజీవి బతుకు అతుకుల బొంతేలే
======================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి