ఊరుగాలి ఈల 37:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఊరూ నగరం అన్నదమ్ముల నీడ తగువులేదు
తిరిగే కాలు నోరు ప్రదక్షిణ ప్రకంపనలే భూమి 
నమ్మకమే చమురు వెలిగే ప్రమిదల ఇల

వెలుగుల దీపాల మసక గాజు ఎక్కదే బతుకు 
కష్టాలపొరలు ఎల్లవేళల నిలువని కథలే
ధైర్యమే చుక్కాని అలల బతుకు నీడ్చే కలల నావ

బతుకు సాకే జీవి పల్లెపేటల లైఫ్ ఓ వైవిధ్యం 
ఆకాశ బంగ్లా నేల గుడిసెన బతుకే తేల్చు బాధ
బతుకు అర్థమే నిండు సర్వ స్వప్నాలు బుర్ర కెక్క

ఆశల గుర్రాల అదుపులో బతుకు ఆహ్లాదసీమ 
జల్సాలు విలాసాలు వోలలాడవు బతుకు కుదుపే
పొదుపు అదుపుల తోట పూలే అందచందాలు

తెగువచొరవల శ్రమ వెలిగే మనిషి బాట
మమతల మట్టిలో కష్టమే ఒట్టిపోని కడవ
గడపగడపన నీరుకన్నీరు మబ్బులేని వాన

పల్లె పేటల జీవమంతా అందాల నడకల భువి
మనసు సహచరి జీవి మల్లెమందారాల వాసి
ఆమె నడకల అతడు సంతసమేలే సందడి

మట్టి మహిమ తెలియదు పనిలేని మనిషికి ఇల
కలిసిన మనసులే చేర్చు ఆనంద తీరాల భువి
అలుకుల అలకలు గాలితేలే నింగి మనిషిమట్టి
===================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు