ఊరుగాలి ఈల 39:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఎన్నో అగాధాలు అడ్డంకులు దాటిన అనుభవం
కత్తుల వంతెన దారి మమతల  పూల విహారి
ఆశ నిండిన  వొడి అమ్మ చేతి చలువ ఊరు
  
ఆపద సంపద పల్లె అనురాగాల ముల్లె ఊరు
పిడుగుల చెడుగుడు వానల తడిసే మనిషి ధైర్యం
చిగురు ఆకుల లేలేత బాల్యం ఆటల వృద్ధగీత

మనసు చెమ్మ జన్మ ఉమ్మినీరు పొత్తిలి కల పల్లె
మంటల మనిషి ఒంటరి ఆశల పందిరి నీడ
చేయి పట్టిన వేలు చలువ గుండె చైతన్య నేత్ర

గరికరాల కోరిక  చెమట చందన ప్రేమ పూలు 
ఆపద అంచుల తిరిగే కలల నది ఎదపొద ఊరు
చెట్టుచేమల గట్టు మనిషి జీవము రేపటిఆశ పల్లె

కాలంలో మట్టివాసన ఒకటే ఎండా వానలే మారు
మనసు మంచిదే దాని అందమే ఆకాశాన తిరుగు
నిజం తెలిసిన బతుకున ఊరువేరు కషాయం

నేల విడిచి సాము చేదు ఇక్కడ నీతికథ  తీపి
అతడు మనిషికాదు తీయని బంధాల మట్టి ఎద
తెనెపట్టులో తేనెపట్టే తెగువ మగువ తీపి ఊరు

ఎన్నో నేర్పిన బడి కాలం పాఠం చదివేదే ఊరు 
అంగలు మరిచిన కాళ్లు పరుగుల బుద్ది ఓర్పు
ఊరంటే మోసే నాగలి దున్నేనవ్వు నా పల్లెపబాట

================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు