పాట్నాలో బి.ఎన్.కాలేజ్ హరితవనంతో కళకళలాడుతోంది. దానికి కారణంప్రతివిద్యార్థి పది మొక్కలు నాటిపెంచాలి. అప్పుడేపాసైనాక సర్టిఫికెట్ ఇస్తారు.జూనియర్స్ వాటిని పోషిస్తూ తామూ మొక్కలను పెంచాలి.ఈఐడియా బాటనీప్రొఫెసర్ ధీరజ్ గౌతమ్ ది.
కేరళలో ఉదయతుంవతిల్ అనే పల్లెలో ప్రైమరీస్కూల్ లో వరండాలో చిన్నారి నించుని ఆంగ్లంలో టకటక సందేహాలు తీరుస్తుంది.పదిమంది కూడాలేని ఆబడిలో నేడు వందమంది పైగా చేరారు.సాఫ్ట్వేర్ ఉద్యోగుల సాయంతో గ్రామ పంచాయతీచేసిన ఏర్పాటిది.
తుర్కిలోని ఇస్తాంబుల్ లోప్లాస్టిక్ వ్యర్థాల్ని రీసైకిల్ చేసే యంత్రంలో వేస్తారు.అందులోనే వీధికుక్కలకు ఆహారంవస్తుంది.జనం మిగిలిన ఆహారం ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు వేస్తారు.కుక్కలకి కింద నుంచి ఆహారం అందుతుంది.చెత్త రోడ్ల పై కన్పడదు.
బెంగుళూర్ శివాజీనగర్ లో పోలీస్ క్వార్టర్స్ లో చెత్త కాలుస్తున్న మంటల్లో లోకేశప్ప కూతురు చుక్కీ కాలిపోయి చనిపోయింది. ఆలాపన సమాధి దగ్గర కూర్చుని జాబ్ కి వెళ్లకపోటంతో భార్య సుధామణి ఆలోచించింది.చుక్కీ పేరుమీద 2020నుంచి బడిపిల్లలకి పేదలకు అవసరమైన వస్తువులిస్తున్నారు. వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.చుక్కీ నెనపు అనే పేరుతో ప్రారంభమై నేడు హర్షాలి ఫౌండేషన్ గా కొనసాగుతోంది🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి