అధికారంలో వున్న కొందరు డ్యూటీ నామ్ కే వాస్తే చేసి బల్లకింద చేతులు చాపే బడాబాబులకాలం! మరి ఇలాంటి ప్రభుత్వ అధికారుల గూర్చి చదివితే సిగ్గుపడటం మనవంతు. కానీ ఈ ఐ.ఎ.ఎస్.ఆఫీసర్లు మనకు ప్రేరణ!తమిళనాడులో చెన్నంపట్టి ఓకుగ్రామం.కొండలు గుట్టలు 40కి.మీ.హాస్పిటల్ కి నడకే గతి.కేరళవాడైన కృష్ణ నున్ని కలెక్టర్ గా వచ్చిన తర్వాత తన సొంత ఖర్చుల తో వైఫై నెట్వర్క్ తో పాటు ప్రతివారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వైద్యులతో రోగుల సమావేశం ఏర్పాటుచేశారు.బడిపిల్లలకు బైటి టీచర్ల తో వీడియోపాఠాలు చెప్పించడం రోడ్లు వేయించడంతో గిరిజనులకు విద్యార్థులకు ఎంతో మేలు జరిగింది.
హర్యానా అంబాలా కలెక్టర్ విక్రంయాదవ్ పంటకోత తర్వాత వ్యర్ధాల్ని తగలబెట్టకుండా కొత్త విధానం అమలుచేశారు. వాటిని ఎరువులు మార్చేయంత్రాల్ని రైతులకు అందజేశారు.అలా పర్యావరణ కాలుష్యం తగ్గించారు.
మధ్యప్రదేశ్ లోని మండలాజిల్లాలో అమాయకులు మోసగాళ్లబారిన పడకుండా కలెక్టర్ హర్షికా సింగ్ కృషి ఫలించినది.ఆమెవాలంటీర్లని ఏర్పాటుచేసి వయోజనవిద్య స్త్రీలకు ఉమెన్ స్కూల్స్ 500గ్రామాల్లో ఏర్పాటుచేసింది. పుస్తకాలు పలకలు ఇచ్చిబ్యాంకుల గూర్చిన అవగాహన కల్పించిన ఆమె చేసిన సేవ హర్షణీయం🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి