అనగనగా ఒక నది ఒడ్డున, ఒక చెట్టు ఉండేది ,ఆ చెట్టు పైన ఒక పక్షి గూడు ఉన్నది. ఆ పక్షికి రెండు చిన్న చిన్న పిల్లలు పుట్టాయి.ఆ రెండు చిన్న పక్షులతో తల్లి పక్షి సంతోషంగా జీవించేది. ఒక రోజు తల్లి పక్షి పిల్లలకు ఆహారం కోసం బయటకి వెళ్ళింది. ఆ రెండు చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్నాయి.అలా ఆడుకుంటూ ఉండగా రెండు పక్షులలో ఒక పక్షి బయటకి తొంగి చూస్తుంది. ఇంతలో అక్కడికి తల్లి పక్షి వచ్చింది. కోపంగా ఎందుకు అలా బయటకి తొంగి చూస్తున్నావు జారి క్రింద పడుతావు. మన శత్రువులో ఎవరో ఒకరు వచ్చి నిన్ను ఎత్తుకెళ్లి పోతారు.మరొక సారి బయటకు తొంగి చూడకు అని అన్నది తల్లి పక్షి. మరుసటి రోజు ఉదయం తల్లి పక్షి ఆహారం కొరకు వెళ్ళింది. తల్లి మాట లెక్క చెయ్యకుండా మరలా తొంగి చూసింది.పై నుంచి ఒక గ్రద్ద వచ్చి ఎత్తుకెల్లి పోయిది.
ఈ కథలోని నీతి : పెద్దల మాట వినాలి వినకపోతే ఇలాంటి ఆపదలు తప్పవు
ఈ కథలోని నీతి : పెద్దల మాట వినాలి వినకపోతే ఇలాంటి ఆపదలు తప్పవు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి