స్ఫూర్తిప్రదాతలు 73 :-సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
 నేడు వైద్యం ఖరీదైంది. రోగాలు చికిత్సలతో బ్రతుకుభారం! యు.పి.కి చెందిన సందీప్ కుమార్  కి 12 వ ఏట ఎముక క్యాన్సర్.లక్షల ఖర్చు! అంకాలాజికల్ కేర్ గివింగ్ కోర్సు పూర్తిచేసి ముంబై హాస్పిటల్స్ లోపనిచేశాడు.కోవిడ్ టైంలో వైద్యులు రోగుల కు ఆన్లైన్లో డిజీస్వస్థ్యని ప్రారంభించిన ఇతనుతన సేవలను  వివరిస్తూ దాదాపు అన్ని ప్రాంతాలు నగరవాసులకి అవగాహన కల్పించడం ముదావహం.కేన్సర్ ని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేసేలా అనుసంధానకర్త గా వ్యవహరిస్తున్న సందీప్ అభినందనీయుడు. 
ఒరిస్సాకి చెందిన ప్రియదర్శిమహాపాత్ర" క్యూర్ బే" నినెలకొల్పి వైద్య సదుపాయాలులేని ఊళ్లకు ఈసంస్థద్వారా రోగుల సేవ చేస్తున్నాడు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులను సంప్రదించి కేవలం 100రూపాయల ఫీజు చెల్లిస్తారు రోగులు.నర్సులు ఫార్మాసిస్టులు అందుబాటులో ఉంటారు.20కేంద్రాలు ఈపనిలో నిమగ్నమైనాయి.ఇతని తల్లి డాక్టర్.ఇతనుగూగుల్ లో పనిచేస్తున్నప్పుడు ఈపనిమొదలుపెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచాడు🌹

కామెంట్‌లు