స్ఫూర్తిప్రదాతలు77:- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 దివ్యాంగుల కోసం చేతులు కోల్పోయిన వారికోసం ప్రవీణ్ కుమార్ అనే యువకుడు మౌస్ వేర్ అనే పరికరం తయారుచేశాడు.మద్రాస్ లో ఇంజనీరింగ్ చదువుతుండగా అతనికి వచ్చిన ఊహకి మద్రాస్ ఐఐటి ప్రోత్సాహించింది.డెక్స్ ట్రావేర్ డివైజస్ అనే అంకురసంస్థని నెల కొల్పాడు. 
శివకుమార్ మోద అనే పల్లె కి వెళ్లాడు.నేతపని పై ఆసక్తి మోజుతో ఎం.సి.ఏ.చదువుని మధ్యలోనే ఆపేసి ప్రయోగాలు చేశాడు.పెడలింగ్ మిషన్ కనిపెట్టి మగ్గానికి  అనుసంధానం చేశాడు.దీనివల్ల కాళ్లకు శ్రమ తగ్గుతుంది. చేనేత కార్మికులకు మహోపకారం చేశాడు .
తమిళనాడుకు చెందిన మోహన్ శ్రీరామ శర్మ  అనే రిటైరైన ప్రొఫెసర్ కనిపెట్టిన యంత్రం రైతులకు ఎంతో ఉపయోగం.ధాన్యాలకి పురుగుపట్టడం సాధారణం.శుభ్రంచేయటం కష్టం.రసాయనాలు వాడకుండా పురుగుల లార్వాతో సహా అరికడుతుంది ఈమిషన్.కేరళలో నెయ్యపల్లి అనేపల్లెలో అన్సియాది నిరుపేద కుటుంబం.వరదల్లో ఇల్లు కూలింది. తండ్రి చనిపోయాడు.నలుగురు ఆడపిల్లలలో  అన్సియా పెద్దది.ఆమె ఫ్రెండ్స్ రకరకాల పనులు చేశారు.డబ్బులు సంపాదించి ఇంటినిర్మాణంలో కూలీలుగా పనిచేశారు.50మంది విద్యార్థులు 99రోజుల్లో ఇల్లు కట్టి తమసత్తా చాటారు. టైలరింగ్ ఫుడ్ స్టాల్స్  మ్యూజిక్ డాన్స్ ప్రోగ్రాంలద్వారా డబ్బు సంపాదన తో పాటు చదువు లో వెనకబడలేదు. అన్సియా చెల్లెళ్లకోసం కొంత డబ్బు బ్యాంకులో వేశారు.నిజంగా అంతా స్వయంకృషితో కట్టిన ఆఇల్లు  స్నేహితుల మంచిమనసుకి దర్పణం🌹
కామెంట్‌లు