స్ఫూర్తిప్రదాతలు79:- సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ
 నేడు ఎన్నో పాఠశాలలు రకరకాల పేర్లతో సౌకర్యాలతో డబ్బుల సంచీకి చిల్లులు పెడ్తున్నాయి. ఐనా చదివిస్తున్నాం.ఈస్వచ్ఛందసంస్థలు చేస్తున్న పనిని బడిలో ప్రవేశ పెడితే ఎంతో బాగుంటుంది.పల్లెల్లో చిన్నారుల కై ముంబై ఛత్రపతిశివాజీ వస్తు సంగ్రహాలయం మ్యూజియం ఆన్ వీల్స్ ని ప్రారంభించింది.పిల్లల దగ్గర కే బస్సువెళ్లి హరప్పా నాగరికత మొదలు మనదేశ సంస్కృతి చరిత్ర  శిలలు పుట్టుపూర్వోత్తరాలను గూర్చిన సమాచారం అందిస్తోంది.వీడియోలతో అవగాహన కలిగిస్తోంది.క్విజ్ ఇంటరాక్టివ్ గేమ్స్ తో చైతన్యంతో పిల్లలు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు.
మంగుళూర్ కి చెందిన ఎం.ఫ్రెండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్  క్లాస్ ఆన్ వీల్స్ పేరుతో ఓ.ఎ.సి.బస్సునిల్యాప్టాప్ ప్రొజెక్టర్ మొదలైన వాటితో కంప్యూటర్ విద్య పై బడి పిల్లల కురోజూ 4బడులకు వెళ్లి 6,7 క్లాసులవారికి చెప్తారు.ప్రత్యేక సిలబస్ తో 70మంది సభ్యులున్నారు.ఎక్కువ మంది విదేశాల లో స్థిర పడినా దివ్యాంగులకు జాబ్స్ వైద్య  భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు.
హైదరాబాద్ లోమొబైల్ కెరీర్ కౌన్సిలింగ్ ల్యాబ్ నుఏర్పాటు చేసింది హైదరాబాద్ కి చెందిన నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ. తెలంగాణ లో అన్ని జిల్లాల్లో ఈబస్సు పర్యటిస్తున్నది. కెరీర్ గైడెన్స్ క్లాసులు పలుకోర్సులను గూర్చిన వివరాలు అందిస్తోంది.పల్లెబాట పట్టింది ఈబస్సు🌹

కామెంట్‌లు