స్ఫూర్తిదాతలు 82 .:-.సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 బెంగుళూర్ లో  నెలకొల్పబడిన గ్రీనేరియా మనదేశంలోనే అతిపెద్ద  రెసిడెన్షియల్ బయోగ్యాస్ ప్లాంటు.దీనికి ఆద్యుడు రాజేంద్ర కుమార్.కెనడాలో  ఉద్యోగం చేస్తున్న ఆయన మనదేశంలో కొండల్లా పేరుకుపోతున్న చెత్తను చూసి బేజారై ఈబయోగ్యాస్ ప్లాంట్ ని ఏర్పాటుచేశాడు.విదేశాల్లో జాబ్ కి రిజైన్ చేసి2014లో గ్రీనేరియా అనే సంస్థను నెలకొల్పి చెత్తను విద్యుత్తుగా మార్చిన మాంత్రికుడు.విప్రో ఇన్ఫోసిస్ హైద్రాబాద్లో మైక్రోసాఫ్ట్  క్యాంపస్ లో కూడా ఏర్పాటుచేసిన ఘనత రాజేంద్ర కుమార్ దే సుమా
ఇప్పుడు నీటిసమస్య ప్రపంచాన్ని పీడిస్తోంది. కానీ వాటర్ వారియర్స్ పుణ్యమా అని దాన్ని అధిగమించారు .తమిళనాడుకు చెందిన డాక్టర్ నిమల్ రాఘవన్ దుబాయ్ నుంచి వచ్చితుఫాన్కి నాశనం ఐన గ్రామాలను చూసి బాధపడ్డాడు.36ఏళ్ల ఆయన సోషల్ మీడియాలో గ్రూప్ ద్వారా చెరువుల పూడిక తీయించి 118 చెరువులను బాగుచేశాడు. మెగా ఫౌండేషన్ పెట్టి తమిళనాడు మహారాష్ట్ర ల్లో చెరువుల పరిరక్షణ చేసిన వ్యక్తిగా నిలిచాడు.
అలాగే బుందేల్ ఖండ్ లోని1550పల్లెలకి దేవుడుగా మారాడు అవనీమోహన్ సింగ్.హరితిక అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పిన ఆయనకృషివలన బీడుభూములు పండ్లతోటలతోకళకళలాడుతున్నాయి. కర్ణాటక కి చెందిన దేవరాజారెడ్డి హైడ్రాలజిస్ట్. బోరుబావుల చుట్టూ దగ్గరుండి ఇంకుడుగుంతలు త్రవ్వించి జలసంరక్షణ చేస్తున్నారు🌹
కామెంట్‌లు