ఈ అసాధారణ యువకుని జీవితం చదివితే కన్నీరు ఆగదు. దేవుని అనుగ్రహం ఉంటే అసాధ్యం అనేది లేదు.డాక్టర్ కలైయర్సన్ మేధావిగా మట్టిలో మాణిక్యంగా మెరిశాడు. కులాంతర పెళ్లి చేసుకున్న వారికి పుట్టాడుఈచిన్నారి.తండ్రిని హత్య చేశారు బంధువులు.ఆబాబుతల్లిని బెదిరించి పసివాడిని. తీసుకునిపోయారు
అత్తింటివారు. మూడేళ్ల రజినీని తిట్లు దెబ్బలతో పిన్నిబాబాయి హింసపెడ్తుంటే బామ్మ తాత గుడ్లనీరు కుక్కుకునేవారు.
బడిలో హెచ్.ఎం.టీచర్ల ఆదరణ తో భోజన సమస్య తీరింది.వారు ఇచ్చిన పాత బట్టలతో ఆపసివాడు బడిలోనే కాలంగడుపుతూనాలుగో క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు.తాత చనిపోయాడు.బాబాయి ఇంటినుంచి వెళ్లగొట్టాడు. టీచర్ల తోటిపిల్లల దయాదాక్షిణ్యాలతో ఆపిల్లాడు తనక్లాస్మేట్ ఇంట్లో ఉంటూ వారితో పాటు కూలీపనికెళ్లేవాడు. టెన్త్ లో హోసూర్ ప్రాంతంలోనే ఫస్ట్ వచ్చాడు.ఎం.బి.బి.ఎస్. చదివాడు తన అధ్యాపకుల చేయూత తో! ఆఖరి పరీక్ష రోజురేపనగా సలసలకాగుతున్న చాయ్ పడి ఛాతీనుంచి తొడదాకా కాలిపోయింది. హాస్పిటల్ లో చేర్చారు.ప్రత్యేక పర్మిషన్ తో లుంగీతో పరీక్ష రాశాడు రజనీ. అలా ఎం.బి.బి.ఎస్.డిగ్రీ పొంది చర్మరోగాలపై స్పెషలైజేషన్ చేశాడు.హోసూర్ లో ఆస్పత్రి పెట్టి కేవలం 20రూపాయల ఫీజు తీసుకున్నాడు.కోవిడ్ టైంలో అతని సేవలకు జనం జేజేలు పలికారు.తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యోనారాయణో హరి కి ఉదాహరణ గా నిలిచాడు.తన తల్లిని గూర్చివాకబుచేసి విఫలుడైనాడు.ఇలాంటి అనాధబాలలు నేడు ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటున్నారు.
( ఆంగ్ల హిందీ పేపర్ల నించి సేకరణ)🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి