స్ఫూర్తిప్రదాతలు85 : సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 గుజరాత్ లోని రాజ్ సమాథియాలాకు ఎన్నో ప్రత్యేకతలు.ఊరంతా ఒకేమాట ఒకేబాట .జరిమానాలు చెల్లిస్తారు .గ్రామ పంచాయతీ ఆఫీసుముందు తాటికాయంత అక్షరాలతో పెద్ద బోర్డుపై నియమాలు నిబంధనలు అతిక్రమిస్తే ఫైన్ లను గూర్చిన వివరాలు స్పష్టంగా రాసిఉంటాయి.40ఏళ్లబట్టీ " మాకు రాజకీయ ప్రచారాల హోరు పోరు వద్దు " అంటూ నిషేధం విధించింది ఆఊరు.కానీ ఓటు వేసితీరాలి .ఓటు వేయకపోతే జరిమానా కట్టాలి.దాదాపు 2500మంది ఉన్న జనాభా! తాగి తందనాలాడితే 500 గుట్కా తింటే50 ఇలా ప్రతిదానికీ శిక్ష అవి కట్టకపోతే జరిమానా !అమ్మ నాన్నల సంరక్షణ  చదువు పై దృష్టి ముఖ్యం.షాపులు ఇళ్లకు తాళాలేయరు. వస్తువులు తీసుకుని డబ్బు అక్కడ పెట్టి వెల్తారు షాప్ ఓనర్ లేకుంటే.జరిమానా డబ్బులతో సోలార్ సిస్టం రోడ్లు బాగుచేయడం ఇలాంటి పనులతో దేశానికే ఆదర్శం రాజ్ సమాధియాలా! జయహో!75ఐదేళ్ల భీంబాయి నాసిక్ లోని ఓజర్ ప్రాంతంలో పుస్తకాంచల్ అనే హోటల్ నడుపుతోంది. ఆమె కి చదువులేదు. త్రాగుబోతు భర్త తో కాపురం పిల్లల పెంపకంలో గడిపిన కష్టజీవి.నేడామె ఓహోటల్ పెట్టి కావల్సిన టిఫిన్లు అందిస్తూ 5వేల పుస్తకాలు అక్కడ ఏర్పాటుచేసిన ఘనత ఆమెది.కథలు నవలలు పిల్లల పుస్తకాలతో సహా ఉంటాయి.అక్కడ చదువుకుంటూ టిఫిన్లు తింటూ సాహిత్యంతో పాటు కుక్షిని కూడా నింపుకుంటారు.భీంబాయి జిందాబాద్!ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం దాయి దీదీ క్లినిక్ లద్వారా బస్సుల్లో లేడీడాక్టర్లు నర్సులను  పల్లెలకుపంపి 50రకాల పరీక్షలు చేస్తూ మందులు ఇచ్చేపథకంని అమలు చేస్తోంది.ఇక సిక్కిం  బాలికల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. 9_15ఏళ్ల లోపు అమ్మాయిల కు  గర్భాశయ ముఖద్వార కేన్సర్ నిరోధక హెచ్.పి.వి.వ్యాక్సిన్ ని ఉచితంగా వేయిస్తోంది. ఈవాక్సిన్ ని ఆరునెలల వ్యవధిలో 3సార్లు వేయాలి.దాదాపు 5వేలరూపాయల ఖరీదైన వాక్సిన్ ని ఉచితంగా సిక్కింప్రభుత్వం అందించడం ముదావహం🌹
కామెంట్‌లు