యుగరత్నా శ్రీవాస్తవ్ యు.ఎన్.ఓ.లో ఓప్రశ్న సంధించి అందరినీ దిగ్భ్రమ లో ముంచింది. తొలిసారి 2009 లో 13 ఏళ్ల ఆచిన్నారి వాగ్ధాటికి అంతా ముగ్ధులైనారు.ఆలోచనలో పడ్డారు." హిమాలయాలు కరుగుతున్నాయి.మంచుప్రాంతాల ప్రాణులు కొన ఊపిరితో ఉన్నాయి.భవిష్యత్తు తరాల మాటేంటి? ఆలోచించండి.పరిష్కారం చెప్పండి పెద్దలూ! హైటెక్ జీవితాలు బ్యాంకుల్లో కోట్లాది రూపాయల జమతో పర్యావరణ పరిరక్షణ కాదు.మాపిల్లలకి మార్గదర్శకులుగా మీరుండాలి.పర్యావరణం పచ్చదనం గూర్చి ఎందుకు మాట్లాడరు? పిల్లలను లుప్తమౌతున్న ప్రకృతిని గూర్చి ఆలోచించి పరిష్కారందిశగా అడుగేయండి.మన ఇల్లు మనదేశం మన భాగోళాన్ని రక్షిద్దాం" ఆచిన్నారి మాటలకు అంతా డంగైపోయారు. కానీ యుద్ధాలు అశాంతి అవినీతి కాలుష్యం మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి మరి!?ఝార్ఖండ్ లోని రాంచీకి 30కి.మీ.దూరంలో ఉన్న ప్రాంతంఖక్సిటోలీ. 87ఏళ్ల వయస్సున్న సైమన్ ఓరావ్ నీరులేక కటకటలాడిన ఆప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాడు.నేలకోత నీటికొరతతో అల్లాడిన ఆప్రాంతంలో తన పొలం లో పక్కన ఉన్న బంజరుభూమిలో చెరువు త్రవ్వాడు.అలా 5చెరువులు తవ్వించి చెక్ డామ్ లు కట్టించాడు.అలా 50గ్రామాల్లో 2_3ఎకరాల విస్తీర్ణంలో వందలచెరువులు వెలిశాయి.ఇప్పుడు బెడోప్రాంతం నుంచి కూరగాయలు అన్ని ప్రాంతాలకెల్తున్నాయి. 2016లో సైమన్ ని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది దేశం.మణిపూర్ వాసి లోకేంద్ర చెరుకురసం అమ్ముతాడు.ఆడబ్బుని కేన్సర్ రో గులకి వినియోగిస్తున్నారు.4ఏళ్లు క్యాన్సర్ తో భార్య బాధపడి శాశ్వతంగా దూరమైంది. ముంబైకి మకాంమార్చి చెరుకురసం అమ్ముతూ ఆవచ్చిన డబ్బును రోగుల కుటుంబాలకు ఇస్తున్నారు.10ఏళ్లలో కోటిరూపాయల విరాళాలందించిన ఆయన మళ్లీ పెళ్లాడలేదు.పిల్లలులేరు. ఆయన వయసు ప్రస్తుతం యాభై!🌹
స్ఫూర్తిదాతలు 86 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి