స్ఫూర్తిదాతలు 87:- సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ
 నేడు చదువును కొనుక్కునే స్థితి.డిగ్రీలున్నా ఉద్యోగాలదగ్గర డింకీలు కొడ్తున్నారు. చదువు చేసే జాబ్ కి పొంతనంలేదు. 
ఇలాంటివాటికి పరిష్కారంకోసం కొంత మంది యువకులు చేస్తున్న కృషినిగూర్చి తెల్సుకుందాం.
కేరళకి చెందిన డాక్టర్ దీపుసెబిన్ కిఇంజనీర్లుప్రియాంక్ చౌబే నిమ్మీ చెరియన్ సై అన్నారు.డైలీరౌండ్స్ అనే అకడమిక్ నెట్ వర్క్ ని ప్రారంభించిన దీనిలో 5లక్షలపైగా వైద్యులు సభ్యులు.విద్యార్థులకు ప్రాక్టీసు చేసే వైద్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.
కాన్వేజీనియస్  సంస్థ ద్వారా జైరాజ్ భట్టాచార్య  శశాంక పాండే  10క్లాసుదాకా పాఠాల్ని కథలు పజిల్స్ పాటలుగా డిజైన్ చేశారు.ట్యాబ్లెట్ల రూపంలో ఉన్నాయివి. స్విఫ్ట్ చాట్ అనే యాప్ నీ తెచ్చారు.9 భాషల్లో అందరికీ నాణ్యమైన విద్య ను అందిస్తున్నారు.
భాస్వత్ అగర్వాల్ ముకుల్ రస్తోగీ" క్లాస్ ప్లస్" అనే వేదిక ద్వారా కాలేజీలు కోచింగ్ సెంటర్ల కి మహోపకారం చేస్తున్నారు.టైగర్ గ్లోబల్  బ్లూమ్ వెంచర్స్ లాంటి సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టడం విశేషం🌹

కామెంట్‌లు