ప్రోతప్ సైకియా అసోంవాసి.పేదరికంతో బడికివెళ్లలేదు.కానీబుర్రకి పదునుపెట్టిన అతను పాన్ షాప్ తో వ్యాపారం ప్రారంభించి క్రమంగా సిల్క్ సెంట్ల తయారీలో నిష్ణాతుడైనాడు.భార్య చనిపోయాక తన ఆస్తిని సద్వినియోగంచేశాడు ఇద్దరు పిల్లల తండ్రి ఐనా కూడా!4 కోట్ల తో స్కూల్ డిజిటల్ కంప్యూటర్ల రోబోటిక్ లాబ్స్ తోపాటు సంగీతం యోగా క్లాసులు నడిపిస్తూ పేద పిల్లల కి ఉచితంగా చదువు భోజన సౌకర్యాలు ఏర్పాటుచేసిన ఘనత ఆయనది!300మంది పిల్లలు చదువుతున్నారు.సరుకులు కూడా ఫ్రీగా పంచుతున్న ఆయన హాస్పిటల్ నిర్మాత కూడా!
ఫెక్ట్ అనే సంస్థని2006 లో దినేష్ ప్రవీణ్ సెంథిల్ అనే నిరుపేద కుటుంబానికి వచ్చిన వారు ఐ.టీ.జాబ్స్ లో చేరారు.అసహాయులకి సేవచేయాలనే భావంతో ట్రస్ట్ ని ఏర్పాటుచేసిన వారు మానసిక దివ్యాంగులకి సాయం మొదలుపెట్టింది. ఆసంస్థ ఎలాంటివారికి చేయూత నిచ్చిందో చూడండి.18 ఏళ్ల ముత్తుకాళీ డోలీ మోస్తూ హోటల్ మానేజ్మెంట్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫీజుకట్టారు.ఆరోజుల్లో ఏడాదికి రెండున్నరలక్షలఫీజ్!ఇప్పుడు ముత్తుకాళీ ఇంగ్లాండ్ లో స్టార్ హోటల్ షెఫ్!
రాజ్ కుమార్ తండ్రి మంచం పట్టిన కూలీ.తల్లి అక్కలు మతిస్థిమితంలేనివారు. పెద్దమ్మ దగ్గర ఉండి మెడికల్ ఎంట్రన్స్ లో200/200మార్కులు తెచ్చుకున్నాడు.సన్మానంచేసినవారు మొహం చాటేస్తే ఫెక్ట్ సంస్థ సాయంతో అతను ఎం.డీ.చేశాడు.ధరణి అనే అమ్మాయికి కౌన్సెలింగ్ ఇప్పించి సి.ఎ.చదివించారు ఆసంస్థ సభ్యులు.వీరిలో నెలకి 10వేలనుంచి లక్షదాకా విరాళాలు ఇచ్చే ఉదారులున్నారు.🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి