అబ్బబ్బా చలి!అహహ ఉహుహు
చంపేస్తోంది పులి
చలిచలిచలి చేమక్కా! కుంపటితేవే గురవక్కా!
ఏడున్నాయి కుంపట్లు!కూకో కట్టెల పొయికాడ"
స్వెట్టర్ సాక్స్ మఫ్లర్ తగిలించి
హాచ్ హాచ్ కీచ్ కీచ్ లతో బద్ధకాలరావు
"ఏమండోయ్!టైం ఐందండోయ్!
బాస్ వేస్తాడు చిందులు!లేవండోయ్" శ్రీమతి గావుకేకలు
"నాన్నా!బడికి డుమ్మా! దగ్గు జలుబు!"నాన్న డొక్కలో ముడుచుకు మూడంకె
"గరంగరం కాఫీ చాయ్ ఇస్తేనే లేస్తా"! పతిదేవుని వేడుకోలు
కార్తీక స్నానాలతో శివ అయ్యప్ప లతో ఆలయాల్లో కోలాహలం
బీదాబిక్కీకి గొంగళి కంబళి దానాలు
శివరాత్రిదాకా సతాయించు
"సీతాకాలం కాదురా బాబూ! శీతాకాలం అని రాయరా!"
తెలుగుమాష్టారి దిద్దుడు
సీతాఫలం అని రాస్తున్నాంకదా మాష్టారూ"? సందేహాలరావు
ప్రశ్నకు "పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదురాబాబూ!"
సారుగారి జవాబు
తెల్లని తుహినకణాలు చెట్లపై మంచిముత్యాలు
సూర్య కాంతిలో రంగుల హంగులతో పత్రాలపై మెరుపులు
ఎండకి మాయం!
అయ్యప్ప స్వాముల కఠిన దీక్ష లతో ఆలయంలో వెచ్చదనం
బద్ధకస్తులం మనం మాత్రం మంచం వదలని బల్లులం
నక్కిన నల్లులం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి