మా చిరునవ్వుల మిలికమ్మ:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా
చిరునవ్వుల మిలికమ్మా
ఏం చేస్తున్నావు నీవమ్మా ?
చదివే ఇక నీకు సిరియమ్మ
చదువుతునే  ఉండాలమ్మ !

జిలిబిలి పలుకులు నీవమ్మా
అమ్మకు నీవే ముద్దుల కొమ్మ
నవ్వుల వదనం ఇక  నీదమ్మా
ఎప్పుడు నవ్వుతూ ఉండాలమ్మ !

కాలేజీకి నిత్యం పోవాలమ్మా
కాలయాపన ఇక చేయోద్దమ్మ
సత్యమునే నీవు పలకాలమ్మ
అసత్యము అసలే ఆడొద్దమ్మా !

అక్కతో నీవు కలిసుండమ్మా
అక్కలాగ నీవు ఎదగాలమ్మ
నిదానమే నీకు ప్రధానమమ్మ
ఎదిగి ఒదిగి ఇక ఉండాలమ్మా !

పెద్దలు చెప్పేమాట వినవమ్మా
సుద్ధులు తప్పక నీవు కనవమ్మ
వృధ్ధిలోకి నువ్వు రావాలమ్మా
ముద్దుగా ఇక నీవు ఉండాలమ్మ !

బంధుమిత్రులను కలువాలమ్మా
వాయి వరుసలను తెలుపాలమ్మ
అలసి సొలసి ఇక నీవుండొద్దమ్మ
కలసి మెలసి వారితో ఉండాలమ్మ!

నీ బ్రతుకే ధన్యం అవుతుందమ్మా
ఆ ధర్మంపైనే ఇక నీవుండాలమ్మ
ధర్మం అధర్మం తేడాను కనవమ్మ
ఆ ధర్మదేవతను నీవు కొలువమ్మ !

విజయం అప్పుడు నీకు కలుగు
అపజయం వెంటనే ఇక తొలుగు
అప్పుడు గర్వంగా నీవిక మెలుగు
తప్పక నీజీవితాన వెన్నెల వెలుగు!


కామెంట్‌లు