మన రామాయణ గ్రంథం !:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
శ్రీరామాయణ గ్రంథంమునే చదవండి
శ్రీరాముని చరితమునే ఇక వినరండి
వింటే అంతా మనకు  మంచే జరుగు
కంటే మన మదిలోన భక్తి రసం పెరుగు !

దశరథుని ముద్దుల తనయుడు శ్రీరాముడు
ఆయన అయ్యనులే ఇలలోన మన దేవుడు
అనుదినం ఆయనను  తలుచుకుందము
ప్రతిక్షణం మన మదిలో ఉండాలని పిలుచుకుందము !

పిలవగానే పలుకుతాడు ఈ మన దేవుడు
తలవగానే నిలుస్తాడు మన ఎదుట ఆ శ్రీరాముడు
అనుదినం మనం చేయాలి ఆయనకు పూజలు
అనుక్షణం మనసు నిలిపి తీర్చుకుందాము మోజులు !

దైవ అంశమున పుట్టిన మన మానవుడు
మంచి పనులు చేయుటచే అయ్యాడు దేవుడు
మానవుడై కొలువబడే మన ఈ శ్రీరాముడు
రఘువంశమును ఉద్ధరించిన రఘు రాముడు !

ఈ రఘురాముడు కౌసల్యా తనయుడు
సౌశీల్యము పెంచుకున్న  దయామయుడు
లక్ష్మణుడు శ్రీ రాముని ముద్దుల తమ్ముడు
ఎల్లప్పుడు శ్రీరాముని వెన్నంటే ఉంటాడు !

పవిత్ర రామాయణ మందు కథానాయకి సీతమ్మ
కథానాయకుడైన ఆ శ్రీరాముని ముద్దుల కొమ్మ
.నాగేటి చాల్లలో దొరికింది మన సీతమ్మ తల్లి
శివ ధనుస్సును విరిచిన శ్రీరాముని ముద్దులమల్లి

సీతమ్మ తల్లి జనకుడు జనక మహారాజు
శ్రీరామునికిచ్చి పెళ్లి చేసి తీర్చుకున్నాడు మోజు
జనకుడు ఆయెనగా ఆ శ్రీరాముని మామ
జనక పుత్రిక ఆయెను శ్రీరాముని భామ !

దశరథుని పుత్రుడు శ్రీ శ్రీరాముడు
దశ దిశల పేరుందిన సిరిధాముడు
అయోధ్య ప్రజలకు ప్రియ పాత్రుడు
శివ ధనస్సును ఎక్కుపెట్టిన ధీరోదాత్తుడు !

శ్రీరాముడు  లక్ష్మణుడు అన్నదమ్ములు
వారికున్నవి సాహసోపేత దమ్ములు 
పర్ణశాలలో పెట్టారు వీరి బొమ్మలు
సీతారామ లక్ష్మణులు మన జేజమ్మలు !

వాల్మీకి రాసింది ఈ రామాయణం
ప్రతినిత్యం చెయ్యాలి పారాయణం
ఛందో బద్దంగా వ్రాయబడింది ఈ రామ కథ
చదివితే తొలగిపోవు మన మనోవ్యద !

పుత్ర కామేష్టి యజ్ఞ ప్రభావంతో పుట్టారు
చిన్నప్పుడే విల్లంబుల తమ చేతబడ్డారు
విలువిద్యలో వారు ఆరితేరినారు
విశ్వామిత్రుడే తమ గురువన్నారు !

శ్రీరాముడు తండ్రి మాటకు తలదాల్చి
తన నోట వనవాసం మాట తండ్రికి చెప్పే పిల్చి
చెప్పిన వెంటనే తండ్రి బోరుమని ఏర్చెను
చెప్పిన మాట విని కైకేయి అతనిని ఏమార్చేను !

 సీతారామ లక్ష్మణులు వనవాసం చేసిరి
వారు ఇంకెన్నో అపవాదులను మోసిరి
మునుల యజ్ఞ యాగాదులను కాపు కాసిరి
 శాంతి ప్రశాంతి కై వారి కడ నివాసం చేసిరి !

సీతమ్మ తల్లిని రావణుడు అపహరించే
అశోక వనములోన ఆమెను బంధించే
ఈ విషయం విని హనుమ లంకకు ఏతెంచె
సీతాదేవిని అశోకవనంలో  తానుగాంచె !

శ్రీరాముడు ఇచ్చిన చూడామణి సీతమ్మ తల్లికి ఇచ్చే
సీతాదేవి చూడామణిని గైకొని ఎంతో సంతోషించే
శ్రీరాముడు వచ్చి రావణుని చంపి తనను తీసుకెళ్లమని చెప్పే
హనుమ రాముని చేరి సీతమ్మ మనసును విప్పే !

సీతాకోరిక మేర రాముడు లంకకు వెళ్లే
రావణుని చంపి సతీసమేతుడై అయోధ్యకు మల్లే
సీతారాముల చూసి ప్రజలందరూ సంతోషించిరి
శుభం పలుకుతూ వారంతా వారిని దీవించిరి



కామెంట్‌లు