దేవుని పిల్లలం !:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్ .9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా
మేం దేవుని ధ్యానించే పిల్లలం
మాగోవును పూజించే మల్లెలం
గుడి గోపురాలు అంటే మాకిష్టం
మడి కాపురాలు అంటేనే కష్టం !

ఆలయం ముందు వరుసలో నిలుస్తాం
ఆ లయకారున్ని ముందుగానే తలుస్తాం
మా భక్త జనంతో సాగుతాము ముందుకు
భుక్తి గుణంతో ఆ గోవిందుని విందుకు!

మేం దేవాలయ శాఖా మంత్రిని
కలుస్తాం
మా దేవాలయ యంత్రాంగాన్ని పిలుస్తాం
జరిగిన అభివృద్ధిని కొంత వివరిస్తాం
జరగని పనుల గూర్చి వాకబు చేస్తాం

మేం యజ్ఞయాగాలను కూడా జరిపిస్తాం
మా ప్రజ్ఞా పాటవాలను ఆడ కురిపిస్తాం
భోగభాగ్యాలను అందరికీ అందిస్తాం
ఆయురారోగ్యాల విందును చిందిస్తాం

పురాణాలను  చదువుతాం
కారణాలను వేగా వెతుకుతాం
వేదాలను క్షుణ్ణంగా గ్రహిస్తాం
వాదాలను లక్షణంగా సహిస్తాం !

ఓంకార రహస్యాన్ని శోధిస్తాం
అలంకార హాస్యాన్ని సాధిస్తాం
యాగ శాసనాలను  లిఖిస్తాం
యోగ ఆసనాలతో సుఖిస్తాం !
 
మేం ఇతిహాసాలను వల్లిస్తాం
మా

దరహాసాలను చిందిస్తాం
క్లిష్టాంశాలను కూడా వివరిస్తాం
సంక్లిష్ట సంశయాల సవరిస్తాం !

కులతత్వం కుడ్యాలను కూల్చేస్తాం
మతత్వం మౌడ్యాలను కాల్చేస్తాం
భక్తి తత్వంతో సాగుతాం ముందుకు
మూర్తి మత్వం లేని జీవితం మాకెందుకు ?

కామెంట్‌లు