గోవిందా గోవిందా అందామా
గోవిందుని నామం విందామా
భజనలు చేస్తూనే ఉందామా
భజ గోవిందునినే కందామా. !
గోవింద గోవింద అనుకుంటూ
గోవింద నామం వినుకుంటూ
గోవిందుని విందూ తినుకుంటూ
అందాము ఆయన దేవుడంటూ !
ప్రతినిత్యం గోవిందుని తలుస్తూ
వ్రత సత్యంగా అందరు కొలుస్తూ
నైవేద్యము ప్రియముగా అందిస్తూ
అందరం ఉందాం ఇక స్పందిస్తూ !
గోవిందుడే మన దేవుడు అంటూ
ఆ మూర్తిని వెంటనే చూడాలంటూ
ఎన్నో కలలను ఇక మనమే కంటూ
ఉందాం ఆతని గానం వినుకుంటూ
వస్తాడు మన కలలోకి గోవిందుడు
ఇస్తాడు విందును ఆ అరవిందుడు
చేస్తాడు మాయలు ఈ ఆనందుడు
వేస్తాడు అడుగులు మా అనంతుడు !
వేస్తాడు బృందావనమునకు దారి
అందరి గోపికలను ఇక తాను చేరి
కొలను లోని కలువ పూలను ఏరి
కోరి పడేను వారి ప్రేమలోన దూరి
గోపికలు అప్పుడు జడుసుకున్నరు
చేతులతో ఒళ్ళును దాచుకున్నరు
చీరలన్నీ మూటగట్టి పెట్టుకున్నారు
గోవిందుని వారంతా తిట్టుకున్నరు!
తిట్టిన కొట్టిన వినలే గోవిందడు
కట్టిన చీరల కనలే ఆనందుడు
మురళి గానం చేస్తూనే ఉన్నాడు
ముద్దులను కురపిస్తా అన్నాడు !
లీలలు సాగించే మన గోవిందుడు
ఈలలు వేసి ముంచే ముకుందడు
అని తెలిసికొని నడుద్దాం ముందు
మనందరికీ ఔతుంది అదే వసందు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి