మా కృష్ణయ్య:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
జయ కృష్ణా ముకుందా మురారి
మా ఆనంద పరమానంద విహారి
రావా మా ఇంటికి నువు ఒకసారి
చూపించవా మాకు నీ రహదారి.!

చెరసాలలో నీవు పట్టితివంట
యశోద నీకు తల్లాయానంట
చరసాలను నీవు దాటితి వంట
రేపల్లె నీకు పెంపుడు
 ఇల్లాయనంట 

గోవర్ధనగిరినీ నీ వెత్తితి వంట!
గోవుల కాపాడితివంట
యమునా నదిని దాటితే వంట
కంసుని మామకు వచ్చెను తంటా !

బృందావనమును నువు చేరితివంట
పదివేల గోపికల ప్రేమించావంట
గోకులంలో నీవు నివసించావంట
గోవుల కాపరి నీవయ్యా వంట !

దేవకి వసుదేవుల పుత్రుడ వంట
అస్టమ గర్భమున జన్మించావంట
దేవకి సోదరుడు కంసుడు అంట
ఆ కంసుడు నీకు మామేనంట !

తృణావర్తుడను రాక్షసుని చంపావంట
వాని చేతుల నుండి తప్పించుకున్నావంట
మాయ రూపుల రాక్షసుల నీవు చంపావంట
మహిలో శాంతిని నెలకొల్పా వంట !

అస్టమ గర్భమున జన్మించిన నీవు
అష్ట భార్యలను పెళ్ళాడినావు
ఆరువేల రాజపుత్రికలతో క్రీడించావు
పదహారువేల గోపికలతో రమించావు !

దశపుత్రులను గన్న దశ గలవాడవు
మట్టిని తిన్న మహిమగల రేడువు
నోటిలో భూగోళాన్ని చూపిన దేవుడవు
నీటిలో అగ్నిని పుట్టించిన గోవిందుడవు !

పాండవులకు కౌరవులకు నీవు
మధ్య రాయబారము నడిపినావు
యుద్ధమును ఆపాలని చూసినవాడవు
విరుద్ధము అయినా ఓపికతో ఉన్నవాడవు !

పాండవ పక్షమున నిలిచినావు
ఈశ్వరుని శనీశ్వరుని కొలిచినావు
విజయం తధ్యమని తెలిపినావు
పాండవులను నీవు గెలిపించినావు !

కురుక్షేత్ర యుద్ధం అంతటితో ముగిసే
రణక్షేత్రంలో తాను కూడా అలసి
ధర్మానికి అధర్మానికి తేడా తెలిసే
కృష్ణుడు ఆపై అందరితో కలిసే

ధర్మక్షేత్ర మందు తొలగెను అశుభం
శ్రీకృష్ణ భగవానుడు పలికేను శుభం
శుభం పలికిన ఆ దేవునికి వందనం
శ్రీకృష్ణావతారానికి అభివందనం !


కామెంట్‌లు