దేవుళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు
మాఊరి గుళ్ళోలోని దేవుళ్ళు
మహిమ గల్గిన మా దేవుళ్ళు
ఎన్నో గోపురాలు ఉన్న వాళ్లు !
మా ఊళ్ళోని ఈ మా దేవుళ్ళు
మణి మాణిక్యాలు అసలే లేనోళ్లు
మా పూరి పూరి పాకలో ఉన్నోళ్లు
శ్రీ సీతారామ లక్ష్మణ అనువాళ్ళు !
వారికి హనుమ ఇక తోడున్నాడు
రాముని బంటై వారికి కాపున్నాడు
సీతమ్మను తల్లిగా చూసిన వాడు
వారిని భుజాలపైన మోసినవాడు
మా ఊళ్ళో ఉన్న ఈ దేవుళ్ళను
శాన్నాళ్ళుగ పరఊళ్ళోని వాళ్ళు
వస్తూ పోతూ తమ దర్శన వేళళ్ళ
మస్తు పొగడుతు ఉన్నారు వేనోళ్ళ
బంగారు లేడి ప్రతిమ ఉందిక్కడ
హా లక్ష్మణా అనుట వినబడదెక్కడ
ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా
కనిపించు అంగరంగ దృశ్యాలిక్కడ
ఇది పర్యాటక ప్రాంతంగా మారింది
సర్కారు దృశ్య పేటికలోనా చేరింది
దృశ్యాలకు కేంద్రంగానే ఇది ఉంది
చూపరులకు ఉండదు ఏ ఇబ్బంది
మా ఊరి ముఖ చిత్రం మారింది
పుణ్యక్షేత్రాల లిస్టులోన చేరింది
చూసినవారికి అందం ఆనందం
మాకు వారితో బంధం అనుబంధం
మా దేవుళ్ళ గూర్చి వివిధ చానల్లా
వార్తలిక వస్తుంటాయిలే పగలెల్లా
అందరికీ కల్గు ఆనందం నిలువెల్లా
వచ్చేస్తారులే మాఊరు మల్లమల్లా
ఇదేనండి మావూరి దేవుళ్ళ కథ
విన్నవారికి తీరిపోవులే వారి వ్యద
కన్నవారికి కలుగునులే మంగళం
అందరికీ కలుగులే శుభ మంగళం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి