ఎక్కువ తక్కువ:-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూలు జిల్లా.
రహదారిపై మనందరం పోతుంటే 
రంతు చేస్తూ రాంకెలేస్తూ జనాన్ని
ముప్పు తిప్పలు పెట్టే వారెక్కువ
మనకు కనిపిస్తారు కసిరిస్తారు !

సహజత్వం కలిగి సహనంతో వెలిగి
సానుకూలంగా అనుకూలంగా
మెలిగి
సహాయ సహకారాలు అందించేవారు
చాలా తక్కువగా మనకు కనిపిస్తారు

రహదారిలో  వచ్చిపోయే వాహనాల రద్దీ
అందులో ప్రయాణించే వివిధ 
వ్యక్తుల బుద్ది
గమనిస్తే ఆభయం అందక భయమేస్తుంది
ఒక్కోసారి మనమే నయమనిపిస్తుంది !

రహదారిలో సంభవించే ప్రమాదాలు
ప్రయాణించే వారిలో కొందరికి ప్రమోదాలు
మరికొందరికి ఏమో భరించలేని ప్రమాదాలు
ఇవి ఎక్కువ తక్కువగా జరిగే తప్పిదాలు !

జరిగే ఒరిగే ఈ పెను తప్పిదాలలో
మనకు
ఎక్కువో తక్కువో భాగం నీకు లేదనకు
అలా భావిస్తే నీ బాధ్యతను తీర్చు కొనుటకు
యత్నించు ప్రయత్నించు లోకానికి తెలుపుటకు !

అలా అందరం ఎప్పుడు ఎల్లప్పుడూ
భావించి బాధ్యతను తలంచి నీవు ఉన్నప్పుడు
ఎక్కువ తక్కువ అన్న ప్రమాదాలు ఉండవప్పుడు
ప్రమాదాలు పోయి ప్రమోదాలు వచ్చునప్పుడు  !


కామెంట్‌లు