చిలకా చిలకా చిలకా
మొలక మొలక మొలక
రంగేళి ఓ మా చిట్టిచిలక
గొంగళి పురుగైన మొలక !
చిలకా చిలకా ఓ చిలకా
రసగుళికల మా మొలక
వద్దూలే నీకు ఇక అలక
ముద్దుగా ఉండాలి చిలక !
చిలకా చిలకా ఓ మా చిలక
నీవేలే మా ముద్దుల మొలక
అలకలు అసలే ఇక వద్దేవద్దు
నిలకడగా నీవుంటేనే ముద్దు !
చిలకా చిలకా ఓ మా చిలక
అలకను వదిలితే ఇస్తా గిలక
గిలకతో ఆడు ఓ మా మొలక
అలసట వస్తే ఆట ఆపుకోఇక !
చిలకా చిలకా మాబంగారం చిలక
మొలక మొలక సింగారం మొలక
వ్రాసేటందుకు నేనిస్తాలే నీకు పలక
ఇక వెంటనే వదులుకో నీవిక అలక
చిలకా చిలకా మా పచ్చని చిలక
మొలకా మొలకా వెచ్చని మొలక
పెట్టిన జాంపండు ఎందుకు తినక
ఉన్నందుకు మాకాయెను తికమక
మా రంగరు బంగరు ఓ చిలక
మా హంగుల పొంగుల మొలక
ఎన్నాళ్ళని ఉంటరు మీరు తినక
ముందే చెబితిమిగా వద్దని అలక
మా మాటను మీరిక వినరండి
మేం చూపిస్తాం మీకు కొలవండి
జాతకం చూసే కార్డులు తీయండి
జాగ్రత్తగా బాధ్యతను మోయండి !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి