వెంకటేశా ఓ వెంకటేశా
ఏడుకొండల వెంకటేశా
తిరుపతిలో నిన్ను చూశా
హుండీలోన కానుక లేశా. !
వెంకటేశా ఓ వెంకటేశా
ఓ మా శ్రీ శ్రీ శ్రీవెంకటేశా
నీ ఏడుకొండలు ఎక్కేశా
నీకే నేను ఇక మొక్కేశా !
వెంకటేశా ఓమా వెంకటేశా
నీ పల్లకి సేవకు నే వచ్చేశా
బృందావనమును నేచూశా
గోవిందా గోవిందా నేఅనేశా !
వెంకటేశా ఓమా వెంకటేశా
అన్నదాన శాలలో భోంచేశా
దిగువ తిరుపతికి వచ్చేశా
దీనులకు నే దానం చేసేశా !
వెంకటేశా ఓ మా వెంకటేశా
నీ దివ్య సన్నిధికి నేవచ్చేశా
కెమెరాతో నీ ఫోటోను తీశా
పూజ గదిలో నేను పెట్టేశా !
వెంకటేశా ఓ మా వెంకటేశా
పుష్కరిణిలో నే స్నానం చేశా
పూజా సామాగ్రిని తెచ్చేసశా
మీ ముందరనే నేను పెట్టేశా. !
మా ఇంటిలో నీ వ్రతమే చేశా
తీర్థ ప్రసాదములు నే పంచేశా
మోక్షం నీవు ఇస్తావని మాఆశ
మీ వ్రత కథలను నేను వినేశా !
వెంకటేశా ఓ మా వెంకటేశా
తిరుమల వీధులలో తిప్పేశా
నీ విగ్రహాన్ని నేనిక మోశేశా
నీ ఆలయములో నే ఉంచేశా !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి