ప్రేమా ప్రేమా ఓ ప్రేమాస్వచ్ఛమైనది ఈ ప్రేమాఅనుభవిస్తేనే గాని అదితెలియదు ఎవరికి ఐనా !ప్రేమా ప్రేమా ఓ మా ప్రేమాఏమాయే అయ్యో రామాగమనించి చూస్తే గాని అదితెలియదు ఎవరికి అయినా !ప్రేమా ప్రేమా ఓ మా ప్రేమానచ్చే మెచ్చే మా స్వర్గసీమాఔనోకాదో తరచి చూస్తే గానితెలియదు ఎవరికి అయినా !ప్రేమా ప్రేమా ఓ మా ప్రేమాఉందా నీకు జీవిత బీమాఉందో లేదో పరికిస్తే గానితెలియదు ఎవరికి అయినా !ప్రేమా ప్రేమా ఓ మా ప్రేమానువు ఆడేటి ఈ హై డ్రామాఏమిటో తేల్చుకుంటే గానితెలియదు ఎవరికి అయినా !ప్రేమా ప్రేమా ఓ మా ప్రేమానిన్ను ప్రేమించిందా కోమాపరీక్షించితే గాని అప్పుడుతెలియదు ఎవరికి అయినా !ప్రేమా ప్రేమా ఓ మా ప్రేమా ఆటపాట పాడుకుందామాఆడారో వీడారో చూస్తే గానితెలియదు ఎవరికి అయినా !ప్రేమా ప్రేమా ఓ మా ప్రేమానీవుంటే మాకెంతో ధీమాఉందో లేదో చూస్తేనే గానితెలియదు ఎవరికి అయినా!ప్రేమా ప్రేమా ఓ మా ప్రేమానీవు ఇప్పుడు సురక్షితమాఉందా లేదా గమనిస్తే గానితెలియదు ఎవరికీ అయినా !ప్రేమా ప్రేమా ఓ మా ప్రేమాఅనవసరంగా అరవకుమాఅరచెనా లేదా వీక్షిస్తే గానితెలియదు ఎవరికి అయినా !ప్రేమా ప్రేమా ఓ మా ప్రేమాఎవరికి నీవు వేరవకుమాఅదెరెనో బెదెరెనో చూస్తేగానితెలియదు ఎవరికి అయినా!ప్రేమా ప్రేమా ఓ మా ప్రేమాఇన్నివేషాలు వేస్తావా లేమానీది స్వచ్ఛమైన ప్రేమన్నావుఎన్నో విధాల చంపేస్తున్నావు !ప్రేమా ప్రేమా ఓ మా ప్రియప్రేమాఏ రోటి కాడ ఆ పాట పాడకుమావెధవ వేషాలు ఇంకా వేయకుమావంచనకు నీవు దారి తీయకుమా !ప్రేమా ప్రేమా ఓ మా ప్రియ ప్రేమాఇలా అలా గోల గోల చేయకుమాఅంగడి బొమ్మల నీవు చూడకుమాగొంగడి కప్పి బొంతలో కమ్మకుమా !ప్రేమా ప్రేమా ఓ మా ప్రియ ప్రేమాప్రేమను ఆనందంగా ఆస్వాదించుబంధాన్ని అనుబంధాన్నిక పెంచుప్రేమ ప్రబంధాన్ని నీవిక సృష్టించు !
ప్రేమ ప్రబంధం !:-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్ .9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి