నువ్వే నువ్వే నువ్వే
నన్నే ప్రేమించావే
పిల్లా పిల్లా ఓ పిల్లా
నువ్వేలే నా రసగుల్లా !
నీ చూపులలోనే నేచ్చిక్కి
నీ ఎర్రటి బుగ్గలనే నేనొక్కి
ప్రేమిస్తున్నానే ఇక నిన్ను
లాలిస్తావనుకుంటా నన్ను !
ముస్తాబై వస్తావంటా నీవు
నీ కోసం చూస్తుంటా నేను
నే నా కలలో నిన్నే చూసా
నీకై నా గాలం ఇక నేవేసా !
నా గాలానికి ఇక చిక్కావు
నాకే ఈ కాలానికి దక్కావు
పిల్లా పిల్లా పిల్లా ఓ నాపిల్లా
రంగుల పొంగుల రసగుల్లా !
నువ్వు చక్కని చుక్కగా వస్తే
నీ ముక్కు కు ముక్కెర చేపిస్తా
నీ తియ్యని ముద్దులు నాకిస్తే
నే నెయ్యముతో నిను వాటేస్తా !
నా నోటితో చెబుతున్న ఈ మాట
నీవు వినుటకు వస్తావా ఈ పూట
మరువక వెరువక నీవిక వస్తే పిల్ల
నా జన్మ ధన్యమైపోవునె ఇక మల్ల
నీ పూల బాణాలను సంధించు
నీ వలపుల కౌగిలి నాకందించు
నీ నవ్వులు పువ్వులు చిందించు
నీ పరవశంలో నన్నిక బంధించు !
తప్పక కావాలి నా కల నిజము
చెప్పకనే నే వేస్తాలే ఇక బీజము
నే చెప్పే ఈ నిజం తెలుసుకో పిల్ల
నా ప్రేమ నిజం తెలిసి రావా మల్ల !
నువ్వు వస్తే నా మనసంతా నీకిస్తా
నిత్యం నీ ప్రేమను నేను ఆరాధిస్తా
నీ ముద్దు మురిపాలలో ముంచు
ముప్పోదుల నీ ప్రేమను అందించు
అప్పుడే మన ప్రేమ ఔతుంది సఫలం
ఎప్పుడు కారాదు మన ప్రేమలో విఫలం
ఇకనైనా తెలుసుకో మన ప్రేమ వ్యవహారం
చేయాలి మన ప్రేమలో నీవు నేను విహారం
కలల నిజం తెలిసి నడిస్తే మంచిది ఓ పిల్ల
కలలు కల్లలు కాకుంటే మంచిది మల్ల !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి