జయ జయ జయ శ్రీ వేంకటేశా
జయహో జయహో ఓ శ్రీనివాసా
గోవిందా గోవిందా అని పిలవగనే
నిలిచేవు నీవు ఇక మా ఎదుటనే !
జయ జయ జయహో ఓ జగదీశా
జయహో జయహో మా శ్రీనివాసా
నీవున్నవు అండ పిండ బ్రహ్మాండం
మాకిస్తావా ఇక అమృత బాండం !
జయ జయ జయహో ఓ వెంకటేశా
జయహో జయహో మా శ్రీ ధరనేశా
యశమును పెంచే మా సర్వాదీశా
మము రక్షించి కాపాడే మా ప్రాణేశా!
జయ జయ జయహో తిరుమలేశా
జయహో జయహో మా అఖిలేశా
కరుణించి కాపాడు ఓ మా ప్రాణేశా
ఏడుకొండలెక్కి నీకోసం నేవచ్చేశా!
జయ జయ జయహో జన ప్రానేశా
జయ దిగ్విజయ మా ఘన అధినేశా
వరమందించి దీవించు ఓ వరాన్వేశా
తిరుమల వాసా ఓ మా శ్రీనివాసా
జయ జయ జయహో సప్తగిరి వాసా
జయ విజయీభవ మా దీక్షా వర ధీశా
మీకు మా మంగళం శుభ మంగళం
సురమంగళం మా స్వరమంగళం.!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి