పిలవకముందే వచ్చేశాడు
రామయ్య మా శ్రీరామయ్య
తలవకముందే మెచ్చేశాడు
మమ్ముల మా శ్రీ రామయ్య !
పెట్టకముందే మా పట్టు తేనెను
ఆరగించెను మా రఘురామయ్య
వైవిధ్యంమైన నైవేద్యం పెట్టామని
తన మదిలో అనుకొనే రామయ్య
కోరక ముందే తను మా అందరికీ
కోరిన వరమును ఇచ్చే రామయ్య
నెరవేరక ముందే తాపరీక్షించుటకు
నేరుగా వచ్చానుగా మారామయ్య
అనుకోకుండా మా లోగిలి నిండా
భోగభాగ్యాల నింపెను రామయ్య
సంబ్రమాశ్చర్యాలతో మేముండ
దర్శనమిచ్చేను మా శ్రీ రామయ్య!
కలవకున్న పిలవకున్న కలలోకి
వస్తున్నాడు మా శ్రీ రామయ్య
మేం వేడకున్న మము వీడకుండా
కోరినవన్నీ ఇస్తున్నాడు రామయ్య
అనుకూలంగా అన్ని మాకిస్తూ
మా కష్టాలను ఇక తాచెడిపేస్తూ
మా లోగిలిలో శుభాల జరిపిస్తూ
ఉన్నాడు రామయ్య శ్రీరామయ్య !
మేము అడగనిదే అన్నీ ఇచ్చిన
మా రామయ్యకు శ్రీరామయ్యకు
మా వాడల మేము కడుతాం గుడి
మేళతాళాలతో చేస్తాము అలజడి!
మా మడితో పూజలు జరిపిస్తాం
ఆ గుడిలో దీపారాధన చేపిస్తాం
సప్తహం కూడా మేము నడిపిస్తాం
మా రాముని ముద్దుగ మురిపిస్తాం
మా రామయ్యకు శ్రీ రామయ్యకు
మా ఊరిలోన కూడా ఊరేగిస్తాం
ఆయన పేరున జాతర జరిపిస్తాం
ప్రజలందరితో పూజలు చేపిస్తాం !
ఆదర్శమూర్తి ఐన ఆ శ్రీ రామునికి
నిత్యం మేము చేస్తామిక వందనం
జనంతోని చేపిస్తాం అభివందనం
అందరి మదిలో ఇక నందనందనం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి