ఎన్నెన్నో సంవత్సరాలు
కనుమరుగై పోయాయి
చేయవలసిన వ్యాపకాలు
నెరవేర్చుకోవడానికి
ఆశలు ఆకాంక్షలు
ఎన్నో మిగిలే ఉన్నాయి
ఇంకా రేపు మాపు అంటే
అసలు మానవుని
సగటు ఆయుర్దాయం
75 ఏళ్లు అనుకున్నా
అందులో నలభై ఏళ్లు
ఎప్పుడో
ఆళ్లక్రిందేదాటేసాము.
చక్కదిద్దేందుకోవలసినది
ఎంతో ఉంది.
మన పిల్లల భవితవ్యం
సామాజిక హోదాకై
ఆత్మగౌరవానికై
ఓ ఇంటి నిర్మాణం.
పండుగ పబ్బాలు
చుట్టరికాలు చేసే సమయం లేదు,
ఊపిరిసలపనీయని
పనిలో ఉండాలన్న
ఉత్సుకత వద్దే వద్దు.
అలా అని ఆయా పనులు
వాయిదా వేయోద్దు.
మహా అయితే ఇంకో ముప్ఫై సంవత్సరాలు,
ఏ రోగం నొప్పి లేకుంటే జీవిస్తావేమో!?
నీఒంట్లో
యే బిపి నో ,
యే షుగర్ రో జొచ్చెనా
ముందే టపాకట్టేస్తావు.
అందుకే
నీవైన
కొన్ని అనుభూతులు,
కొన్ని అనుభవాలు,
నీవాళ్ళకు
నీ చుట్టూత ఉన్నాసమాజానికి
వదిలి వెళ్ళు.
అంతే కానీ
నీ బ్రతుకు పోస్ట్ చేసాము
అడ్రస్ తప్పువ్రాసాము
అన్నట్టు జీవించకు.
లే !
మేలుకో!!
నేడే శుభదినం
నీలాగా నువ్వు ఉండడానికి
నువ్వు పూనుకో
సమాజానికి
నీవైన ఆనవాలు
కొన్ని మిగల్చు పదపదా!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి