మనం పంజరం విడిచిన
పక్షులంకాదు.
బాధ్యతల్ని మరచిన స్వేచ్ఛా విహంగాలం కానేకాదు.
ఈ అనంత విశ్వంలో అణువంతైన నువ్వు
ఆకాశమే హద్దుగా...
యే అవకాశాన్ని వదలకా.. అసాధ్యాల్ని సుసాధ్యం
చేయుటకై సన్నద్ధం కావాలి.
నిత్యసంఘర్షణే జీవితం
సత్యశోధనే దాని యేకైక మార్గం.
నిన్నే మార్చే సమాజం చుట్టూత ఉంటుంది.
కర్తవ్యం నిర్వహిణే నీ( మన)
ఏకైక లక్ష్యం.
విజయం నీ పాదాక్రాంతం.
నీలో నిరాశ నిస్పృహలు
కల్గిన వేళ ,
నీ విజయం పరంపరను
గుర్తు తెచ్చుకో...
ఆగనికాలానికి
నీ ఆశయసాఫల్యంతో
తగుజవాబు చెప్పూ...
దూరపు కొండలు ఎప్పటి నునుపు కాదు.
హృదయాంథకారాన్ని
విజ్ఞానమనే దివిటీతో వెలుగించు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి