లోకాస్ట్ నోకాస్ట్ ఆటలు :- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
లోకాస్ట్ నోకాస్ట్ ఆటలు

మా పసితనపు ఆటలు
వీటి వస్తువులు
అన్నీ స్థానికంగా దొరికేవే
తాటిముంజలు తీసిన తర్వాత
ఉన్న తాటికాయలతో
బండ్లు తయారు చేసేటోళ్ళం.
పంగలకర్రసహాయంతో
ఆ బండ్లు ముందు వెనక్కి నడిపేటోళ్ళం.

పాడైన సైకిల్ టైర్ బండ్లు.
సైకిల్ రీమ్ బండ్లు.

సిగరెట్ పెట్టె ముందు వెనుక
కవర్లను
టప్పాలాట అని ఆడెటోళ్ళం.

బర్కిలీ సిగరెట్ అయితే
వంద అని,
విల్స్ సిగరెట్ అయితే రెండొందలని , పందెం కాసి
ఆడెటోళ్ళం.

గోలీలు,
చిర్రగోనె,
బొంగరాలాట,
గాలిపటాలెగరేసే ఆట,
వామనగుంటలాట,
పచ్చీసాటా,
పులిమేక ఆట,
ఇవన్నీ నాడు గ్రామసీమల్లో
ఆబాలగోపాలాన్ని అలరించిన ఆటలు.

దమ్మిడి ఖర్చులేదు
ప్రతీ ఆటకో నియమనిబంధనలు ఉండేవి.

గ్లోబల్ మార్కెట్ దెబ్బకు
ఇవన్నీ నేడు కాలగర్భంలో కలిసిపోయాయి.

ఖర్చులేని ఆటలు
శారీరక మానసిక ఆరోగ్యాన్ని
పెంపొందించే ఆటలు.

ఇప్పుడు ఆ ఆటలెక్కడివి
ఇప్పుడు అన్ని ఆన్లైన్ గేమ్స్ తో
శారీరక వ్యాయామం లేక
మానసిక ఒత్తిడి ఏర్పడి 
ఇటు శారీరక మానసిక ఆరోగ్యాలు
దెబ్బతిని,
అరవై యేండ్ల వయస్సులో రావాల్సిన
బీపీ ,షుగర్ లాంటి జబ్బులు
వయస్సుతో సంబంధం లేకుండా  

చిన్న వయసులోనే వచ్చిచనిపోతున్నారు.

ఇప్పటికీ మించిపోయిందేమిలేదు
పూర్వపు ఆహారపు అలవాట్లు,
ఆటపాటలు మళ్ళీ మొదలుపెట్టాలి.

దేశసంపద ,దేహసంపద
పెంపొందించుకోవాలి.

సర్వేజనా సుఖినోభవంతు
సర్వేసుజనా సుఖినోభవంతు


కామెంట్‌లు