సాహిత్యమే నాతోడు నీడ:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
ఈ సాహితీ వ్యాసంగం నాతోడుగాలేకుంటే
నేనొంటరినై 
మనోవేదనతో 
నేనెప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవాణ్ణి

నన్ను ఆత్మీయ నేస్తమై 
 అక్కున చేర్చుకుంది.

బాధలో ఓదార్పు గీతమైనది.

ఆలోచనలు నాలో పురిగొల్పి
ఆశయసాధనకై
నడుముకట్టమంది.

ఒంటరిగున్నప్పుడు
మౌనిలా..
నాతో తను సంఘర్షిస్తుంది,సంభాషిస్తుంది.

జీవన సాఫల్యానికై
దారుల్ని వెతుకమంటుంది.

సాహిత్యమే సామాజిక చైతన్యానికి ప్రతీక అని
సమసమాజం స్థాపన నీ( మీ)ఏకైక లక్ష్యం కావాలని
తనునన్ను భుజం తట్టి ముందుకు
నడుపుతుంది.

నిత్య సాహితీ సేద్యంతో
చుట్టూత ఉన్న సమాజానికి
దిశానిర్దేశం చేయమంటుంది.

కొండంత సమస్యను నాకు గొరంతగా
చూపి
సమస్యచుట్టూతే
పరిష్కారం ఉందని ఉద్భోదిస్తుంది.

సాహిత్య కారులు
సమాజానికి మూలస్తంభాలని
నినదిస్తుంది.

కామెంట్‌లు