అసలు ప్రపంచమే నాలో నిండియున్నట్టు....!?:-అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
ఎందుకో నా మనసు 
ఏదో పరివిధాలుగా యోచిస్తోంది
భయం తనువు అణువణువూన అలుముకున్నది
కొన్ని జ్ఞాపకాలు నన్ను వెంటాడే క్రీనీడలై నన్ను ఒకపట్టాన 
నింపాదిగా ఉండనివ్వడంలేదు.

ఒక్క క్షణం ఎంతో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షింస్తానో...
మరుక్షణమే అంతే నిదానం గా
అథః పాతాళంలోకి నన్ను నేను పడదోసుకుంటున్నాను.

మునుపటి సుఖసంతోషాలు
మోమున కరువై
ఏదో తెలియని పరివేదన
జనసమూహంలో ఒంటరిగా ప్రయాణం సాగిస్తున్నట్టు...
ఎందుకో ప్రపంచం బాధ‌ 
నా బాధైనట్టు
అసలు ప్రపంచమే నాలో నిండియున్నట్టు...
అంతుచిక్కని ప్రశ్నల పరంపర మొదలై...
పీడకలలెన్నో నా కన్నులు కని నా మనస్సు కకావికలమై..
ఇప్పుడు నిస్తేజంగా..
నిరాడంబరంగా‌...
సత్యాన్వేషినై...
నన్ను నేను 
పునర్ నిర్వచించుకొనుటకై
సమాయాత్తమవుతున్నా....!?



కామెంట్‌లు