మానాన్న:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
నా తనువు అణువణువూ
నాన్న భిక్షే 
తనుపెంచి పోషించినదే

నాన్న తను చూడని ప్రపంచాన్ని నేను చూడాలని
తన ఆశను నా శ్వాసగా మలచి
నేను సాధించిన విజయాలు
తను సాధించినట్లుగా
తాదాత్మ్యం చెందే త్యాగశీలి మానాన్న

నా జీవననౌకకు చుక్కానితాను
తానెన్ని అవమానాలు అవహేళనలు పడ్డా
పైకి గంభీరంగా కనిపించే
సాహసి
మానాన్న

తన రెప్పలపాటు ఉప్పొంగే బాధను
ఒంటరై ఎంత మథనపడ్డాడో
మా నాన్న

నాకై కరిగే క్రొవ్వొత్తిలా
ఆశలు ఆకాంక్షలు అన్ని
నాకై తాను కని
నా విజయపరంపర చూసి
ఒంటరై ఆనందించే
అనామకుడు మానాన్న

మా నాన్న కు
నేనేమివ్వగలను
తాను ఇచ్చిన ఈ ప్రాణాన్ని
ఈ దేహాన్ని ఇవ్వమంటే
ఈ క్షణమే ఇచ్చేస్తాను

నాలో స్వార్థపు రక్కసి జడలు విప్పక ముందే నాన్న
ఋణం తీర్చుకోవాలి

 నాన్న నా రియల్ హీరో
నాన్న నా ప్రతీ గెలుపులో
ప్రతీ మలుపులో ఉన్న ఒకే ఒక్కడు
నా మేరుపర్వతం మా నాన్న


కామెంట్‌లు