వివిధ:-అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
దుఃఖం ఒక్కరోజుతో ముగిసేదికాదు 
సంపదుంటే  దుఃఖం దూరంగుండదు
బాధించడమే దాని యేకైక లక్ష్యం
దుఃఖం లేనివాడొక్కన్ని ఈ లోకంలో చూపండి.

కాలానికి కళ్ళెం వేయాలని చూస్తున్నారు వెర్రి వాళ్ళు
కాలాన్నిఅనుసరిస్తూనే ముందుకెళ్ళాలని, ఎప్పుడు తెలుసుకుంటారో ఈ టైమ్ పాస్ గాళ్ళు,

నువ్వు వాడినా వాడకున్న గతించేదీ, చలనశీలమైనదీ కాలము.
కాలసూక్తాన్ని పారాయణం చేస్తూ
కాలహరణకాకుండాచూడు‌.

కొందరు ఇతరులు దుఃఖ పడుతుంటే
రాక్షసానందం పొందుతారు.
ఆ క్షణాన వారికి మనకు ముందెన్నడూ దుఃఖమే కల్గదన్న అహంభావం.
ఈ దుఃఖముందే దీనికి తనపరభేదమేమి ఉండదు.
అందరిని ఒకే గాటన కట్టేస్తుంది.

అమ్మానాన్నను ఆదరించనోడు
పినతల్లిని ఏనుగు అంబారీనెక్కించాడంట.
ఇది ఎవరైనా నమ్మేటట్టైన ఉండాలి
కన్నోళ్ళనే కాననోడు పరాయి వారిని
అందలమెక్కిస్తాడా!? పాడుకాలమనుకోవాలా?!
కసాయి కొడుకులు కన్నందుకు తల్లిదండ్రులు ఏమిచేయలేని నిస్సహాయతతో తమను తామే నిందించుకోవాలా!?


కామెంట్‌లు