మన తల్లిదండ్రులే మన హీరోలు:-అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
ఎవ్వరా ‌..హీరో ‌..
మన నాన్నే
మన హీరో...

డబ్బులకు ఎన్నో టేకుల్లో
నటించే
తెరమీది నటులా హీరోలు...
వీరెప్పుడైన మొలలోతు బురదలో పంటపొలాల్లో పనిచేసారా...!

వీరికి వ్యవసాయం అంటే తెలుసా...
ఎవరో స్కీప్ట్ వ్రాస్తే
మరొకరు దర్శకత్వం వహిస్తే
ఇంకొకరు నిర్మాణ
వ్యయాన్నంతాభరిస్తే...
మనం చూ‌సినచ్చి మెచ్చితే

థియేటర్స్ లో టికెట్ చినిగితే
నాలుగు షోలు హౌస్ ఫుల్ గా నడిస్తే 
బొమ్మ బ్లాక్ బస్టర్
అదే త్రీవీక్స్ లో పెట్టిన డబ్బు
టికెట్ రేట్లు వందశాతం పెంచి వెచ్చించిన డబ్బు బొమ్మ చూపిలాక్కుంటారు.

ఆపూటకు తినడానికి తిండి లేనోడుగూడా
ఆడెవడో హీరోకి డైహార్ట్ ఫ్యానటా...

తల్లిదండ్రులేరా.. మీ(మన) హీరోలు

మీకు జన్మనిచ్చినందుకు
మీకు రక్తమాంసాలు పంచినందుకు

విద్యాబుద్ధులు నేర్పించినందుకు

మీ ఉన్నతికి కారకులైనందుకు
మీ అమ్మానాన్నలకు
హృదయపూర్వకంగా
కృతజ్ఞతలు చెప్పండి.

ఎప్పటికైన మీ రియల్ హీరో మీ అమ్మా నాన్న లే
ఈ రీల్ హీరో ల కోసం
 ఈ కొట్లాటలు ఎందుకు?!

పేమెంట్ తీసుకొని నటించే నటులు
కాదు మనకు కావాల్సినది.

అసాంఘిక కథావస్తువులతో
నడిచే సినిమాలు కాదు

మనంచూడవలసినది, తీయవలసినవి.

శ్రమజీవన సౌందర్యాన్ని సినిమాగా మలచండి

పర్సనాలిటీ డెవలప్మెంట్ పై కథలల్లీ సినిమాగా తీయండి.

మోరల్ వ్యాల్యూస్ పై సినిమాలు తీయండి.
వెండితెర సామాజిక చైతన్యానికి ప్రతీక కావాలి.
కానీ
డబ్బులు దండుకోవడమే 
ఏకైక మార్గంగా
విభిన్న సామాజిక మాధ్యమాల్లో మనం తీసిన పైత్యపుకథా సినిమాలు
అర్థనగ్న సినిమాలను ప్రదర్శించి 

ఎదిగే వయసులో ఉన్న పిల్లలను వక్రమార్గంలో పయనించేలా చేయకండి.

సినిమా టిక్కెట్ల కోసం క్యూలైన్లలో తొక్కిసలాట జరిగి చస్తే
నా తప్పేం లేదు
ఎవడురమ్మనాడు.

మొదటి రోజు మొదటి ఆటకు ఎవడురమ్మన్నాడు.
అని పలికే ప్రబుద్ధులు ఉన్నారు.

సినిమా గూర్చి హైప్ క్రియేట్ చేసాకా

కుర్రకారు ఎమోషన్స్ కంట్రోల్ తప్పితే
దానికి పూర్తి బాధ్యత సదరు సినిమావారు కాక మరెవరవుతారు.

ప్రియమైన తల్లిదండ్రులారా
ఎదిగే

వయసులో ఉన్న
మీ పిల్లలపట్ల జాగ్రత్తలు తీసుకోండి.

చుట్టూత ఉన్నది అసమసమాజానికి మన మంచి కాంక్షించే భావనేలేదు.

మీ పిల్లలను మీరే కాపాడుకోవాలి
తస్మాత్ జాగ్రత్త
ఎప్పుడు ఏ విపత్తు ముంచుకొనిరానుందో...!?

కామెంట్‌లు