మహిళలు మహారాణులు
అన్ని రంగాల్లో
ప్రగతిని సాధిస్తున్న
అతివలు
ఆర్థిక స్థిరత్వంతో
దేశప్రగతిలో భాగస్వాములవుతున్న
ఐశ్వర్య లక్ష్ములు
చదువు సంధ్యల్లో
తిరుగులేని విజయాలు
ఉద్యోగ జీవితంలో
చివరి మనిషికి సైతం
అభివృద్ధి ఫలాలు దక్కితీరాలనే
సంకల్పంతో ఉన్న
మాతృమూర్తులు
ఆంక్షల ,కట్టుబాట్లు
దాటి
సామాజిక చైతన్యమే
ఏకైక మార్గంగా
మహిళా సాధికారతే
సమసమాజ స్థాపనకు
వాహికగా
మున్ముందుకెళ్తున్న
ధీరవనితలు
ఆత్మగౌరవం కోసమై
ఆత్మరక్షణ విద్యలెన్నింటినో
నేర్చి,
ఆడదంటే
అరిటాకు కాదని
ఆడదంటే ఆటంబాంబని
ఆదరిస్తే అనురాగవల్లియని
చిడాయిస్తే అపరకాళియని
చాటిన ధైర్యశాలురు
మనకు జన్మనిచ్చిన తల్లులు
మన తోబుట్టువులైన అక్కాచెల్లెళ్ళు
జీవితాన్నే త్యాగం చేసిన ఇంటికి దీపాలు
ఆ ఇంటి ఇల్లాలు
ఆడపిల్లలను రక్షిద్దాం
ఆడపిల్లలను ఎదగనిద్దాం
ఆడపిల్లలను చదవనిద్దాం
ఆడపిల్లలను ఆత్మగౌరవంతో బ్రతకనిద్దాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి