గంట మోగ బడి నిశ్శబ్ద సెలయేరు
చదువులమ్మ నాలో మీటె ఎదపాటల
తాండవమాడె పాదాలు పులకించే తోట
అక్షరం మొలకలు పొలాల చదువు
ఎదిగిన చెట్లకు అ ఆ ఇ ఈ మెట్లు
నింగి చుక్కల వెలుగు విద్య నేల దీపాలు
సంచి పుస్తకాల బరువు ఘన కీర్తి తలపైన
గణిత సాంఘిక శాస్త్రాలు సైన్స్ పాఠాల
తెలుగు హిందీ ఇంగ్లీషు భాషల భుజాలు
కలల కాంతులు మెరిసే తరగతి గదిలో
నడకనేర్పిన ఓనమాలు మనసు నిండ
బలపాలు సుద్దముక్కలు రాసే నల్లబల్ల
లాగు నెక్కరు పైన అంగి కప్పే బట్ట
మనసు నిండైన బాల్యం ఆటపట్టు
దీపాల రవ్వల మూట అవ్వ చేతి బువ్వ
ఆట తోటల పాట పూల పూవాన
కురిసేటి చదువులు వాన పూలు
ఆకలికి అన్నమూ చదువుకై బడి దారి
ఉసికవాగుల ఊరె ఊట బావులు
తడి ఇసుక ఆడే పిచ్చుకగూళ్ళ ఆటల
పరవశం నీదీ నాది ఆటలమ్మ వొడి
*********************************

గొప్పగా రాస్తున్నారు డాక్టర్ గారూ...
శుబాకాంక్షలు మీకు.
-----డా.కె.ఎల్.వి.ప్రసాద్
సికిందరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి