అన్నీ తెలియకనే బతుకున
నడకల దారి బాటసారి
పుట్టుక కూడా అంతే
అడుగు తడబాటు బాల్యానికి
తెలియక నడకల సైకిల్
పడి ముద్దాడే నేల
రక్తచారల గాయం పసిప్రాయం నొప్పి
పెడల్ తొక్కడం
మాట కాదు
నరంలేని నాలుక తిప్పేంత ఈజీ కాదు
రెండు గిర్రల నడుమ ఇరుసు
ఒడుపుగ తొక్కే కాళ్ళకే తెలియదు
ఊగాతో తిరిగే చక్రాల గొలుసు ఓపిక
కోరిక తీరేదాకా తిప్పు నమ్మకంగా మట్టి
కానీ
అంతులేని ఆశ
నడిచే పాదాల పడేసేవరకు
తెలియక నడక తెలిసి దుఃఖం వైపు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి