చిన్నారులు:- -గద్వాల సోమన్న,-9966414580
ప్రాణమున్న బొమ్మలు
ప్రకాశించు ప్రమిదలు
ఇంటిలోన పిల్లలు
కంటిలోన కాంతులు

నగుమోముల బాలలు
నిండు పున్నమి చంద్రులు
చీకటిని తరిమేసే
నింగిలోని భానులు

వికసించే పూవులు
చిన్నారుల నగవులు
సుతిమెత్తని మనసులు
మాధుర్యము పలుకులు

వంశంలో శ్రేష్టులు
జగతి ప్రగతి బాటలు
ఎదిగే పసి పిల్లలు
కాబోయే నేతలు

పిల్లలున్న కళకళ
తారల్లా మిలమిల
వారు లేక గృహములు
పోవునోయి! వెలవెల


కామెంట్‌లు