దేవుడు-జీవుడు:- -గద్వాల సోమన్న,-9966414580
మహోన్నతుడు దేవుడు
వారి సృష్టి జీవుడు
భక్తితో పూజిస్తే
శక్తి నొసగు దయాళుడు

సర్వాన్ని గాంచువాడు
అనిశము కాచువాడు
నామాన్ని జపిస్తే
కనికరం చూపువాడు

ఆయస్సునిచ్చువాడు
గర్వాన్ని అణచువాడు
విలువలతో బ్రతికితే
శుభములిచ్చువాడు

దేవునితో వైరము
నిప్పుతో చెలగాటము
పెట్టుకోకూడదు
నాశనము కాకూడదు


కామెంట్‌లు