రేపటి వెలుగులు బాలలు:- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,9966414580.
"విరిసే సుందర పూవులు
మెరిసే మిలమిల తారలు
రేపటి వెలుగులు బాలలు
కురిసే తొలకరి చినుకులు

పారే గలగల యేరులు
ప్రాకే మెత్తని తీగలు
బుడిబుడి నడకల పిల్లలు
ఎదిగే పచ్చని మొక్కలు

ఎగిసే తారాజువ్వలు
ఎగిరే చక్కని గువ్వలు
తీయని పలుకుల బాలలు
వెలిగే దివ్వెల సొగసులు

వీచే చల్లని గాలులు
పూచే పూవుల తోటలు
ముద్దులొలుకు చిన్నారులు
చూచే కన్నుల కాంతులు"


కామెంట్‌లు