అమ్మ అనురాగ దేవత:- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,9966414580.
అమ్మ నోటి మాట
తేనె వోలె తీయన
బిడ్డలకదే కోట
జీవితాన రక్షణ

వెన్నెల్లా చల్లన
పువ్వుల్లా మెత్తన
అమ్మ మనసు చూడుము
మంచులాగ తెల్లన

అమ్మ ప్రేమ వంతెన
సదనంలో దీవెన
చెప్పుకొన్న వేదన
మదికెంతో స్వాంతన

అమ్మ వంటి దేవత
అమెకున్న బాధ్యత
ఎక్కడా చూడలేం!!
పూజించు అంచేత


కామెంట్‌లు