అమ్మకు వందనము:- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,9966414580.
అమ్మలోని సహనము
నింగిలా విశాలము
పరికింపగ పదిలము
అందరికాదర్శము

అమ్మలోన ఉన్నది
ఎనలేని మమకారము
ఆకాశం చిన్నది
అసమానము త్యాగము

అమ్మ ప్రేమకు లేదు
ఏదీ! కొలమానము
ఏ భయం దరి చేరదు
బలమైన ప్రకారము

ఓర్పుకు మరో పేరు
భూదేవి రీతిలో
ఇంటి క్షేమము కోరు
ఎప్పుడూ మనసులో

ఆమె ఉన్న సదనము
అగును నందన వనము
మనసారా! వందనము
మాతృమూర్తికి అనిశము


కామెంట్‌లు